కాకతీయ, ఖానాపూర్: రాష్ట్రంలో యూరియా కొరత కష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.యూరియా కొరత వలన ఏమి చేయాలో అర్థం కాక అటు పంటలను రక్షించుకోలేక ఆ గమ్య గోచర పరిస్థితిలో రైతులు రోడ్లెక్కి మరి నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసనల్లో భాగంగానే బుధవారం రోజున వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతులు యూరియా కోసం ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వంట మార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వలన జాతీయ రహదారి పై పలు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. నెల రోజులుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో యూరియా కోసం రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన ఇప్పటికీ యూరియా కష్టాలను అధికారులు తీర్చలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత అధిగమించే ప్రయత్నాలు చేసి, రైతులకు యూరియా అందించి, రైతులను ఆదుకోవాలని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


