రైతుల ఆందోళన
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి క్లస్టర్ జయపురం రైతు వేదిక వద్ద యూరియా ధర పెంచడంపై రైతులు ఆదివారం ఆందోళన నిర్వహించారు.యూరియా ఒక బస్తాకు రూ.280 బదులుగా 300 తీసుకోవడంపై ఏఈఓ కళ్యాణిని నిలదీశారు.యూరియా ఒక బస్తాకు 280 రూపాయలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ ను వివరణ కోరగా మండలంలోని ఒక ప్రైవేటు డీలరుకు 17 టన్నులు యూరియా రావడం జరిగిందన్నారు.జయపురం రైతు వేదిక వద్ద ఏఈఓ ఆధ్వర్యంలో కూపన్లు ఇచ్చామని తెలిపారు.రవాణా చార్జీ మరియు హమాలి ఖర్చులను కలిపి 300 రూపాయలకు 45 కేజీల యూరియా బస్తాను సదరు డీలరు అమ్మినట్లు తెలిసిందన్నారు.
రైతుల ఆందోళన
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


