బాధిత కుటుంబ సభ్యులకు గండ్ర పరామర్శ
కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన కీ.శే. లట్ట సాయి ప్రసన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సాయి ప్రసన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన కీ.శే. మానేటి నాగరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న గండ్ర వెంకట రమణా రెడ్డి, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మృతినివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తమతో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


