సిరిసిల్లలో నకిలీ సిగరెట్ల దందా..!
గోల్డ్ ఫ్లేక్ లైట్స్ పేరుతో డూప్లికేట్ సిగరెట్ల విక్రయం
అసలు–నకిలీ ప్యాకెట్లు ఒకేలా… వినియోగదారులు గందరగోళం
తక్కువ ధరకు సరఫరా… మధ్యవర్తులపై అనుమానాలు
ఆరోగ్యానికి ముప్పు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం ప్రమాదం
అక్రమ దందాపై విచారణ చేపట్టాలని వినియోగదారుల డిమాండ్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జరుగుతున్నట్లు వినియోగదారుల నుంచి వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఐటీసీ సంస్థకు చెందిన గోల్డ్ ఫ్లేక్ లైట్స్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ సిగరెట్లు మార్కెట్లో విక్రయమవుతున్నట్లు సమాచారం. పట్టణంలోని పలు రిటైల్ దుకాణాల్లో ఈ నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అసలు బ్రాండ్‌కు పోలికగా ప్యాకింగ్ ఉండటంతో సాధారణ వినియోగదారులు సులభంగా మోసపోతున్న పరిస్థితి నెలకొంది. స్థానిక వ్యాపారులు, వినియోగదారుల వివరాల ప్రకారం అసలు మరియు నకిలీ సిగరెట్ ప్యాకెట్లు బయటకు చూస్తే దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. ప్యాకింగ్ డిజైన్, హెచ్చరికల ముద్రణ, బ్రాండ్ లోగో కూడా పోలి ఉండటంతో తేడా గుర్తించడం కష్టమవుతోంది. మార్కెట్ ధర కంటే 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ధరకు ఈ ప్యాకెట్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. అధికారిక డీలర్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారా సరఫరా అవుతున్న సరుకులపై ఎక్కువ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లేబల్లో సూక్ష్మ తేడాలు… గుర్తించడం కష్టం
అసలు గోల్డ్ ఫ్లేక్ లైట్స్ ప్యాకెట్‌పై గోల్డ్ కలర్ స్పష్టంగా మెరుస్తూ ఉండగా, నకిలీ ప్యాకెట్లలో అది మసకబారినట్లు కనిపిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని ప్యాకెట్లలో ముద్రణ స్పష్టత లేకపోవడం, అక్షరాల రంగులో తేడా, ప్యాకెట్ నాణ్యత తగ్గడం వంటి లక్షణాలు గమనించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇవి సూక్ష్మ తేడాలు కావడంతో సాధారణంగా గుర్తించడం కష్టమవుతోందని తెలిపారు.
ఆరోగ్యానికి ముప్పు.. ప్రభుత్వానికి ఆదాయ నష్టం
నకిలీ సిగరెట్ల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణలో లేని పొగాకు, ప్రమాదకర రసాయనాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, నకిలీ సిగరెట్ల విక్రయం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో భారీ ఆదాయ నష్టం వాటిల్లే అవకాశముందని ఆర్థిక వర్గాలు సూచిస్తున్నాయి. ఈ అక్రమ దందాపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి అధికారిక డీలర్ల వద్ద నుంచే సిగరెట్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.


లేబల్లో కొద్దిపాటి తేడాలు…
అసలు గోల్డ్ ఫ్లేక్ లైట్స్ సిగరెట్ ప్యాకెట్‌పై ఉండే గోల్డ్ కలర్ స్పష్టంగా మెరుస్తూ ఉండగా, నకిలీ ప్యాకెట్లలో అది మసకబారినట్లు కనిపిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని ప్యాకెట్లలో ముద్రణ స్పష్టత లేకపోవడం, అక్షరాల రంగులో తేడా, ప్యాకెట్ నాణ్యత తగ్గడం వంటి లక్షణాలు గమనించవచ్చని సమాచారం. అయితే ఇవి సూక్ష్మ తేడాలు కావడంతో గుర్తించడం సులభం కాదని పేర్కొంటున్నారు. నకిలీ సిగరెట్ల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉపయోగించే పదార్థాలు నియంత్రణలో లేకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇక నకిలీ సిగరెట్ల విక్రయం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. అక్రమ తయారీదారులు, మధ్యవర్తుల ప్రమేయంతో ఈ దందా జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నకిలీ సిగరెట్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ప్యాకెట్లను కొనుగోలు చేయకుండా అధికారిక డీలర్ల వద్ద నుంచే సరుకులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.


