epaper
Monday, March 2, 2026
epaper

కాంట్రాక్టర్లకు జాతర

కాంట్రాక్టర్లకు జాతర
మేడారంలో అభివృద్ధి ప‌నుల‌పై వెల్లువెత్తుతున్న ప్ర‌శ్న‌లు
ఒకే కాంట్రాక్టర్ గుప్పిట్లో కీలక పనులన్నీ
ప్రతి జాతరలో పెద్ద మొత్తంలో పెరుగుతున్న ఎస్టిమేష‌న్లు
అభివృద్ధి ప‌నుల్లో కొర‌వ‌డుతున్న నాణ్య‌తా ప్ర‌మాణాలు
ఈసారి కూడా అభివృద్ధి పనుల్లో స్పష్టమైన లోపాలు
హ‌డావుడిగా పూర్తి చేసి.. అంతా తూతూ మంత్రంగా చేసేస్తారా..?
పెద‌వి విరుస్తున్న మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ భ‌క్తులు

కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ రాష్ట్ర ఆదివాసీల మహాకుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఇప్పుడు భక్తుల విశ్వాసం కంటే కాంట్రాక్టర్ల లాభాలకే పెద్ద వేదికగా మారుతోందన్న ఆరోపణలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రతి సారి వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. కానీ ఆ నిధుల వినియోగంపై ప్రశ్నలు మాత్రం ప్రతి జాతరతో మరింత బలపడుతున్నాయి. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు కొందరు బడ కాంట్రాక్టర్లకు వరంగా మారాయని, అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రతి జాతరలో పనుల అంచనాలు పెంచుతూ కోట్ల రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో చేపట్టే కీలక అభివృద్ధి పనులు ప్రతిసారి ఒకే బడ కాంట్రాక్టర్ చేతికి వెళ్లుతున్నాయని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏడు కోట్ల రూపాయల అంచనాలు ఉన్న పనుల్లో పెద్ద మొత్తం సదరు కాంట్రాక్టర్ జేబులోకే వెళ్తోందని, జాతర వస్తే చాలు ఎస్టిమేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనుల్లో కనీసం 10 శాతం లాభం తనకే దక్కేలా అధికారులతో పావులు కదుపుతున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు సరిగా లేకపోవడం, నాణ్యత లోపించడం పట్ల భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రభుత్వమే చేయలేదా…?

మేడారం జాతరలో అత్యంత కీలకమైన ప్రాంతమైన జంపన్న వాగుపై భక్తుల కోసం స్నాన ఘట్టాలు, తాత్కాలిక నీటి సరఫరా, బట్టలు మార్చుకునే గదులు, ఇసుక చెక్‌డ్యామ్‌లు, మోటర్లు, పైపులు ఏర్పాటు చేయడానికి ప్రతి జాతర కోట్ల రూపాయలను టెండర్ల రూపంలో వెచ్చిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్ వంటి శాఖలు ఉన్నప్పటికీ ఈ పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లకే అప్పగించడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఒకే జాతరకు ఖర్చయ్యే నిధులతో ప్రభుత్వమే మోటర్లు, పైపులు కొనుగోలు చేసి ఆయా శాఖల ఉద్యోగులతోనే పనులు చేపట్టితే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేయవచ్చని వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిసారి ప్రైవేటు కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

పాత వస్తువులకు ప్రతి ఏడాది కొత్త రంగు…

మేడారం జాతర పనుల్లో దాదాపు 10 శాతం కీలక పనులు జంపన్న వాగు పరిసరాల్లోనే జరుగుతున్నాయి. ఈ పనులకు ప్రతిసారి టెండర్లు పిలుస్తున్నప్పటికీ ఒకే వ్యాపారి టెండర్లు దక్కించుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతను గత జాతరలో కొనుగోలు చేసిన మోటర్లు, పైపులు, ఇతర పరికరాలను ప్రతి జాతర సమయంలో మళ్లీ అమర్చడం, జాతర పూర్తయ్యాక అవే పరికరాలను ఊడదీసుకుని తీసుకెళ్లడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. మినీ జాతర, మహాజాతర వచ్చినప్పుడల్లా అదే పాత పరికరాలకు కొత్త రంగు పూసి, కొత్తవని చూపించి కోట్ల రూపాయల బిల్లులు వేస్తున్నాడని భక్తుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఈసారి కూడా అభివృద్ధి పనుల్లో అదే తరహా లోపాలు కనిపిస్తున్నాయని భక్తులు పెదవి విరుస్తున్నారు.

ప్రతిసారి అతనికే ఎందుకు…?

జాతర వస్తే చాలు జంపన్న వాగు పరిసరాల్లో జరిగే కీలక పనులన్నీ అదే బడ కాంట్రాక్టర్‌కు ఎలా దక్కుతున్నాయి? పాత వస్తువులే వాడుతున్నప్పుడు ఖర్చులు ఏటేటా ఎందుకు పెరుగుతున్నాయి? నాణ్యత ప్రమాణాలు ఎందుకు కనిపించడం లేదు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఇచ్చే కమీషన్లకే ఆశపడి అధికారులు ప్రతిసారి అతనికే టెండర్లు కట్టబెడుతున్నారని, దాంతో కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేటు వ్యాపారి జేబులోకి వెళ్లిపోతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర పనులపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి పారదర్శకత తీసుకురావాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img