నమాజ్‌కు సౌకర్యాలు కల్పించాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని
కాకతీయ, హుజురాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతంగా నమాజ్ నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్ వంటి సౌకర్యాలు సమగ్రంగా ఉండాలని సూచించారు. ఈద్గాలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జామే మస్జిద్ ఈద్గా & ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, మస్జిద్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఫయజుద్దీన్, మహమ్మద్ రియాసత్ అలీ, సుధీర్, ముస్లిం నాయకులు ఉల్ఫాత్, అబిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.


