శాంతి భద్రతలపై సర్పంచ్‌లతో ముఖాముఖి
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఎస్సై క్రాంతి కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, తహశీల్దార్ రాజమల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణలో సర్పంచ్‌ల పర్యవేక్షణ కీలకమని తెలిపారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నూతన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను సన్మానించారు.


