ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
కాకతీయ, కరీంనగర్ : భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ అజయ్ ఆధ్వర్యంలో హంస హాస్పిటల్స్, గుడ్ లైఫ్ హాస్పిటల్స్ (కరీంనగర్) సహకారంతో ఆదివారం బొమ్మకల్ కృష్ణానగర్ జెండా గడ్డ వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి డివిజన్ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో కంటి, దంత, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఈస్ట్ జోన్ అధ్యక్షులు అవుదుర్తి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎలగందుల నందకుమార్, రైల్వే బోర్డు సభ్యులు పాశం తిరుపతి, మాసం గణేశ్, గాలిపల్లి నారాయణ, పెద్ది లక్ష్మణ్, శ్రీరాముల శ్రీకాంత్, అరుణ్, శివాలయం, చింతల సతీష్, గంగారపు వంశీ, తోడేంగల హరీష్, కాంపెల్లి నందు, గెల్లు అనిల్, జగజీవన్, శివాజీతో పాటు 34వ, 6వ డివిజన్ నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


