జిల్లావ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు
కాకతీయ, ఖమ్మం : నేరాల నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, వాహనాలను తనిఖీ చేశారు. అదేవిదంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి , రేషన్ బియ్యం వంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. అదేవిధంగా మద్యం మత్తులో వాహనాలు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథంలో డ్రంక్ అండ్ తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు. దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు.


