epaper
Wednesday, March 25, 2026
epaper

వైద్యం పేరుతో దోపిడీ

వైద్యం పేరుతో దోపిడీ
పెద్ద ఆస్ప‌త్రుల‌తో గ్రామీణ వైద్యుల లింకు
చిన్న వైద్యానికి పెద్ద ఆస్ప‌త్రికి రెఫ‌ర్ చేస్తున్న ఆర్ఎంపీలు
ప‌రీక్ష‌ల పేరుతో వేల‌ల్లో ఫీజులు గుంజుతున్న ఆస్ప‌త్రులు
క‌మీష‌న్లకు ఆశ‌ప‌డి రోగుల‌ను బ‌లి చేస్తున్న గ్రామ వైద్యులు
ఆరోగ్య కాపాడుకోవాల‌నే భ‌యంతో ఆర్థికంగా న‌ష్ట‌పోతున్న జ‌నాలు

కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : హుజూరాబాద్–జమ్మికుంట ప్రాంతాల్లో వైద్యం పేరుతో దోపిడీ బహిరంగంగా సాగుతోంది. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని అడ్డంగా పెట్టుకుని ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు కలిసి కమిషన్ గొలుసు నడుపుతున్నాయి. చిన్న అనారోగ్యాన్ని పెద్ద సమస్యగా చూపించి రోగులను పట్టణాలకు మళ్లించడం సాధారణంగా మారింది. గ్రామాల్లో జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలకే మొదట ఇంజెక్షన్లు వేస్తారు. వెంటనే పరిస్థితి విషమమైందని చెబుతారు. కుటుంబ సభ్యులను భయపెడతారు. “ఇక్కడ చికిత్స కుదరదు” అంటూ పట్టణంలోని నిర్దిష్ట ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఇదంతా ముందే ప్లాన్ ప్రకారం జరుగుతోంది.

చిన్నజ‌బ్బుకు.. పెద్ద హాస్పిటల్‌కు రెఫ‌ర్‌

పేషెంట్‌ను తీసుకెళ్లేలోపే ఆస్పత్రులకు సమాచారం చేరుతుంది. ఆస్పత్రికి వెళ్లగానే నేరుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. ఇతరులను పక్కనబెట్టి ముందుగా పరీక్షలు ప్రారంభిస్తారు. ఇది ఆర్‌ఎంపీలు, ఆస్పత్రుల మధ్య ఉన్న బలమైన లింకును స్పష్టం చేస్తోంది. ఆస్పత్రిలోకి వెళ్లిన తర్వాత అసలు దోపిడీ మొదలవుతోంది. చిన్న సమస్యకే భారీ చికిత్స అవసరమని చెబుతున్నారు. రోగులను, వారి కుటుంబాలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. డాక్టర్ల పేరుతో వరుసగా టెస్టులు రాస్తున్నారు. అవసరం లేకపోయినా స్కాన్లు, ల్యాబ్ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో పేషెంట్‌పై రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వేస్తున్నారు. ఈ మొత్తంలో పెద్ద భాగం కమిషన్లుగా తిరిగి ఆర్‌ఎంపీలకు చేరుతోంది. ప్రతి పేషెంట్ ఒక “డీల్”గా మారిపోయాడు. ఎంత ఖర్చు పెడితే అంత కమిషన్ అన్న లెక్కన వ్యవహారం నడుస్తోంది. మందుల విషయంలో కూడా ఇదే దందా కొనసాగుతోంది. నిర్దిష్ట మెడికల్ షాపులకే రోగులను పంపిస్తున్నారు. అక్కడ మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒకే మందు ఒక చోట ఒక ధర, మరోచోట మరో ధర ఉండటం సాధారణమైపోయింది. “ఇక్కడే కొనాలి” అంటూ రోగులపై ఒత్తిడి తెస్తున్నారు. బయట కొనొద్దని స్పష్టం చేస్తున్నారు. ఇలా రోగిని పూర్తిగా ఒకే గొలుసులో బంధించి డబ్బులు గుంజుతున్నారు. ఈ వ్యవస్థలో బలైపోతున్నది పేద ప్రజలే. చిన్న జబ్బే పెద్ద అప్పుగా మారుతోంది. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవాలనే భయం దోపిడీకి ఆయుధంగా మారింది. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే సంబంధిత శాఖల పర్యవేక్షణ కనిపించడం లేదు. నియంత్రణ లేకపోవడంతో ఈ దందా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దోపిడీ కేంద్రంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..! క‌రీంన‌గ‌ర్‌ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల‌ వినతి గ్రామానికి రావాల్సిందిగ...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img