వాలీబాల్ జాతీయ పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుడు
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్‌కుమార్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ విషయాన్ని కరీంనగర్ డివైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలలో భక్తు రాజ్‌కుమార్ ప్రతిభ చాటుకుని అఖిల భారత సివిల్ సర్వీసెస్ పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 21 నుండి ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో ఆయన పాల్గొననున్నారు. భక్తు రాజ్‌కుమార్ ఎంపికపై కరీంనగర్ ఎస్‌జిఎఫ్ కార్యదర్శి వేణు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పేట అధ్యక్షుడు బాబు శ్రీనివాస్, సెక్రటరీ ఆడెపు శ్రీను, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్ సంపత్ రావు, కొమురోజు కృష్ణ, జిట్టవేణి శ్రీను, అనూప్ రెడ్డి, వీర్‌పాల్ రెడ్డి, సంతోష్, మహేష్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


