- లయన్స్ క్లబ్ ఆఫ్ సేవ తరుణీ అధ్యక్షురాలు శ్రీదేవి
కాకతీయ, పెద్దవంగర: విద్యార్థులు చదువుకునే సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని, దానికోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవ తరుణీ అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు. గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ సేవ తరుణీ ఆధ్వర్యంలో మండలంలోని చిట్యాల జడ్పిఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలన్నారు. దానికోసం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి వ్యాయామం చేయాలని సూచించారు. ధ్యానం, నడక, సరైన టైం కి నిద్రపోవడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా . ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రోజు విజయకుమార్, సెక్రెటరీ పద్మావతి, లయన్ ఉమా రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


