epaper
Monday, March 2, 2026
epaper

జ‌మ్మికుంట పీఠంపై ఉత్కంఠ‌

జ‌మ్మికుంట పీఠంపై ఉత్కంఠ‌
మ్యాజిక్ ఫిగ‌ర్‌కు దూరంగా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు
బీఆర్ఎస్‌కు కావాల్సింది మ‌రో ఇద్ద‌రి మ‌ద్ద‌తు
కాంగ్రెస్‌కు కావాల్సింది మ‌రో ఆరుగురి మ‌ద్ద‌తు
ముగ్గురు ఇండిపెండెంట్లు,ఏఐఎఫ్‌బీ కౌన్సిల‌ర్‌ మ‌ద్ద‌తు సాధించిన‌ట్లు ప్ర‌చారం
బీజేపీ, బీఆర్ ఎస్ కౌన్సిల‌ర్ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు బంప‌ర్‌ ఆఫ‌ర్లు
కీల‌కంగా మారిన బీజేపీ కౌన్సిల‌ర్ల మ‌ద్ద‌తు..!!
క్యాంపు రాజకీయాలతో మారుతున్న సమీకరణాలు
తెరవెనుక కీల‌క‌మైన‌ ప్రణవ్ వ్యూహాలు అమ‌లు
చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. చైర్మన్ పోరుపై హైటెన్షనే..!

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు హంగ్ వైపు దారితీయడంతో చైర్మన్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 30 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 10 స్థానాలు, బీజేపీ 4, స్వతంత్రులు 3, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానంలో విజయం సాధించాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అధికార సమీకరణాల కోసం తీవ్ర రాజకీయ కసరత్తు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బీఆర్‌ఎస్‌కు మరో ఇద్దరి నుంచి నలుగురి వరకు మద్దతు అవసరమవుతుండగా, కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు స్వతంత్రులు, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ మద్దతు కీలకంగా మారింది. కొందరు స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల నిర్ణయం కూడా చైర్మన్ పీఠాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది.

క్యాంపు రాజకీయాలు, వ్యూహాత్మక కదలికలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. బేరసారాలను అడ్డుకునేందుకు కౌన్సిలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులతో వరుసగా సంప్రదింపులు జరుపుతూ తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమీకరణాల్లో కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ
బీఆర్‌ఎస్ కూడా తమ బలాన్ని కాపాడుకునేందుకు ప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. క్రాస్ ఓటింగ్ అవకాశాలు, చివరి నిమిషం చర్చలు, మద్దతు మార్పులు వంటి అంశాలు చైర్మన్ ఎన్నికను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరిగే వరకు పరిస్థితులు ఎటు మారుతాయోనన్న ఉత్కంఠ నెలకొనగా, జమ్మికుంట మున్సిపల్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img