కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలో సోమవారం అనంతారం, బోడగుట్టతండా, ఏటిగడ్డతండాలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ మహబూబాబాద్, ఎస్టీ ఎఫ్ హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆబ్కారి శాఖ సిఐ చిరంజీవి మాట్లాడుతూ.. దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేశామని, 22లీటర్ల సారాయి స్వాధీనం చేసుకుని 800 లీటర్లబెల్లం పానకం ధ్వంసం చేశామని తెలిపారు. అనంతరం సారాయి తయారీదారులను తహశీల్దార్ ముందు బైండోవర్ చేయటం జరిగిందని తెలిపారు.
ఈ దాడులలో నాగేశ్వర్ రావు, నాగయ్య, నీరజ, ఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ లు, చంద్రశేఖర్, అశోక్, కిరీటి, మధు, శివదాస్, కానిస్టేబుళ్లు రాజు, వెంకటరమణ, శ్రీను, ఇబ్రహీం పాల్గొన్నారు.


