epaper
Saturday, March 28, 2026
epaper

మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు

మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు
రాత్రివేళల్లో రహస్య తవ్వకాలు వెలుగులోకి
గుంతలతో బయటపడిన గుప్తనిధుల వేట
భద్రతా లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఖిల్లా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

కాక‌తీయ‌, శంక‌ర‌ప‌ట్నం : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని కాకతీయ కాలానికి చెందిన ప్రాచీన ఖిల్లా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం రాత్రివేళల్లో రహస్యంగా తవ్వకాలు నిర్వహించిన ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఖిల్లా పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గమనించినప్పటికీ పెద్దగా అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే అదే వ్యక్తులు రాత్రి వేళల్లో ఎవరికి తెలియకుండా ప్రణాళికాబద్ధంగా తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. శ‌నివారం ఉదయం ఖిల్లా వద్దకు వెళ్లిన స్థానిక యువకులు పలు ప్రదేశాల్లో లోతైన గుంతలు తవ్వబడటం, మట్టిని పక్కకు కుప్పలు చేయడం గమనించారు. గుంతల తీరు పరిశీలిస్తే గుప్తనిధుల కోసం ఉద్దేశపూర్వకంగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తుండ‌డంతో వెంటనే ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

నిర్లక్ష్యమే కారణం…ప‌ర్య‌వేక్ష‌ణ లోపం పై గ్రామ‌స్తుల ఆగ్ర‌హం..

ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి ఖిల్లా వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడం రాత్రివేళల్లో పర్యవేక్షణ లేకపోవడమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఖిల్లా పరిరక్షణపై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారుల నుండి స్పందన లేదని గ్రామ‌స్తులు తెలుపుతున్నారు. చారిత్రక కట్టడంపై ఇలాంటి తవ్వకాలు నిర్మాణాన్ని దెబ్బతీయడంతో పాటు విలువైన చారిత్రక ఆధారాలను నాశనం చేసే ప్రమాదం ఉందని, గుప్తనిధులపై ఉన్న అపోహలే కొందరిని ఇలాంటి అక్రమాలకు ప్రేరేపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ప‌ర్య‌ట‌క కేంద్రంగా అభివృద్ది చేయాలి..

మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవ‌డం లేద‌ని స్థానికుల నుండి తెలుస్తున్న స‌మాచారం. ఖిల్లా వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్ జిల్లా పాలనాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం పరిశోధన, నాయకత్వంపై దృష్టి డా....

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి నుస్తులాపూర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా...

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై...

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని...

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు

డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సడలింపు కాకతీయ,...

అంగన్వాడీలకు ఆధునిక సదుపాయాలు పిల్లల హాజరు పెంపే లక్ష్యం

అంగన్వాడీలకు ఆధునిక సదుపాయాలు పిల్లల హాజరు పెంపే లక్ష్యం మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ,...

చిన్న ప్రయాణమైనా సీట్‌బెల్ట్ తప్పనిసరి

చిన్న ప్రయాణమైనా సీట్‌బెల్ట్ తప్పనిసరి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రోడ్డు భద్రతపై ‘అరైవ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img