అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం
పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్
కాకతీయ,ఆత్మకూర్ : సమ్మక్క జన్మస్థానమైన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ వనదేవతలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదాసి శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని జాతరను కాంగ్రెస్ ప్రభుత్వంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆదర్శంగా అభివృద్ధి చేసారన్నారు. భక్తులందరూ సమ్మక్క జన్మస్థానంలో దర్శించుకుని వన దేవతలను సమ్మక్క సారలమ్మా ల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేగుల రాజు, మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ యాకుబ్ పాషా , కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆడెపు సర్వేశం,మాదాసి అనిల్,శీలం రవి, గుండాల నగేష్,ఎండి అక్తర్,రేగుల అనిల్,తిరుపతి,కందగట్ల రవీందర్,గోపు సాయిరాం,రాజేష్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.


