పీవీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి
బల్దియా కమిషనర్ సమ్మయ్య
కాకతీయ, హుజురాబాద్ : దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ప్రగతి బాట పట్టించిన దూరదృష్టి గల నాయకుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బల్దియా కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని పీవీ మార్గ్ వద్ద పీవీ నరసింహారావు 21వ వర్థంతి సందర్భంగా పీవీ సేవా సమితి–ఆలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ భవితవ్యాన్ని మార్చిన మహానేత పీవీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు తూం వెంకట్ రెడ్డి, బి. మనోజ్‌తో పాటు చి. జనార్దన్, సందెల వెంకన్న, కె. సదానందం, సాగి వీరభద్ర రావు, చిలకమారి శ్రీనివాస్, కొండ గణేష్, మాజీ సర్పంచ్ సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


