అందరూ చదవాలి… అందరూ ఎదగాలి!
కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అన్ని వర్గాల ప్రజలు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలనే సంకల్పంతో తాను నిరంతరం సహాయ సహకారాలు అందిస్తానని కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో ఇల్లందు శాఖ గ్రంథాలయానికి కొల్లి ఫౌండేషన్ సహకారంతో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్, రైటింగ్ ప్యాడ్లు అందజేశారు. గ్రంథాలయాన్ని వినియోగిస్తున్న విద్యార్థినీ–విద్యార్థులు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోటీ పరీక్షల పుస్తకాలు అవసరమన్న విద్యార్థుల విజ్ఞప్తికి స్పందించిన కల్పనా చౌదరి, సుమారు రూ.15 వేల విలువైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయ గ్రంథపాలకురాలు జి. మణి మృదులకు అందజేశారు. ఈ సందర్భంగా మణి మృదుల మాట్లాడుతూ— అన్ని దానాల్లో విద్యాదానం అత్యుత్తమమని, నిరుపేద విద్యార్థులకు కొల్లి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


