- పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు
కాకతీయ, పరకాల : రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించడానికి సోమవారం నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పరకాల మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు కోరారు. నియమావళి ప్రకారం ఇరవై నాలుగు గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు, రాజకీయ పరమైన రాతలు కానీ ఉండరాదన్నారు. అదేవిధంగా 48 గంటలలోపు పబ్లిక్ స్థలాలలో 72 గంటల లోపు ప్రైవేటు ప్రాపర్టీలలో బ్యానర్లు తదితర ప్రకటనలు తొలగించాలని మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో ఆదేశించారు.


