- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశేట్టి చంద్రమౌళి
కాకతీయ, నడికూడ : పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కంఠాత్మకూర్, ధర్మారం, సర్వాపూర్, కౌకొండ, వెంకటేశ్వర్లపల్లి, నార్లపూర్, పులిగిల్ల, రాయపర్తి, వరికోల్ గ్రామాల లో బి.ఆర్.ఎస్ ముఖ్య కార్యకర్తల తో బి ఆర్ ఎస్ నాయకులు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసే ఆశావహుల జాబితానీ సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దురిశేట్టి చంద్రమౌళి మాట్లాడుతూ రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధులను ప్రతి ఒక్క కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి అత్యధిక మెజారిటీ తో గెలిపించే విధంగా కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు, బీముడి నాగిరెడ్డి, సుధాటి వెంకన్న, నందికొండ జైపాల్ రెడ్డి, గణపతి రెడ్డి, మచ్చ రవి, రాము, ఆయా గ్రామాల గ్రామ కమిటీ అద్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


