కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామ టీఆర్‌ఎస్ నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాకనాటి సోమా రెడ్డి మృతిపట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. మంగళవారం ఆయన సోమా రెడ్డి భౌతికకాయానికి
నివాళులర్పించి అంత్యక్రియల్లో పాడె మోశారు. రాజకీయల్లో తనతో కలిసి నడిచిన సోమారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సోషల్ మీడియా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాడె మోసిన ‘ఎర్రబెల్లి’
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


