మృతురాలికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, చల్లా
కాకతీయ, గీసుగొండ: మృతురాలికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్ తల్లి ఎల్లమ్మ నిన్న సాయంత్రం మృతిచెందింది.నేడు ఎల్లమ్మ పార్దేవ దేహాన్ని సందర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల వివరాలు తెలుసుకున్నారు.దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రంలో ఎనమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, గుర్రం రఘు, చల్లా వేణుగోపాల్ రెడ్డి, పూండ్రు జైపాల్ రెడ్డి, అంకతి నాగేశ్వరరావు, కోటి, జక్కు మురళి, నమిండ్ల రాజు, యూత్ నాయకులు సిరిశే శ్రీకాంత్, కోట ప్రమోద్, సల్ల రాజు, యుగేందర్, మంద రాజేందర్, గోనే నాగరాజు, జహీర్ తదితరులు పాల్గొన్నారు.


