కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపెల్లికి చెందిన చిన్నారులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి గణేష్ నవరాత్రుల్లో ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆ చిన్నారుల సృజనాత్మకతను ప్రశంసించారు.
మడిపెల్లి చిన్నారుల మండపాన్ని గణేష్ నవరాత్రుల సమయంలో సందర్శించిన ఆయన ఆదివారం వడ్డేపల్లి నివాసంలో చిన్నారులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు. జ్యామెట్రీ బాక్స్‌లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు బహుమతులుగా అందజేశారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, విద్యార్థి దశలోనే సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో చిన్నారులు అక్షిత, వశిష్ట, అనుశ్వి, విశ్వాన్, ఆదిత్య, శ్రీహర్ష్, కీర్తి, రోహిత్, సాయి శరణ్య, మనస్వి, భవ్యశ్రీ, శ్రీనిత్య, సాత్విక్, రుత్విక్, సాయిదీప్, సహస్ర, నాయకులు రఘు, ప్రవీణ్, నవీన్, రంజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


