ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన కొక్కొండ రమేష్ రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) సింగపూర్ కిట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వద్ద ఉన్న బాత్రూంలో ఉరివేసుకుని అభిలాష్ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు.జరిగిన అపఘాతంతో సిర్సపల్లి గ్రామంలో అంతా శోకంలో మునిగిపోయింది.


