కాకతీయ, నర్సింహులపేట : కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) మండల అధ్యక్షుడు డొనికెన రామన్న అన్నారు. పడమటిగూడెం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కల్లుగీత కార్మిక సంఘం మూడో జిల్లా మహాసభల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలకు గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. గీత వృత్తిలో ప్రమాదానికి గురైన 710 మందికి ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా రూ.12 కోట్ల 96 లక్షలు ఇవ్వాలని బాధితులు నిరాహార దీక్షలకు పూనుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, పెండింగ్ ఎక్సగ్రేషియా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేజీకేఎస్ మండల ప్రధానకార్యదర్శి చిర్ర సతీష్, పెద్దగౌడ చిర్ర మల్లయ్య, జక్కి మురళి, ఉపేందర్, రవి, యాదగిరి, సుధాకర్, నరేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


