పద్మశాలి సంఘం కన్వీనర్‌గా ఎలిగేటి కిష్టయ్య
కాకతీయ, గీసుగొండ : గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల పద్మశాలి సంఘం కన్వీనర్‌గా 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన ఎలిగేటి కిష్టయ్యను నియమించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి వరంగల్ జిల్లా సంఘం అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడేపు రవీందర్, ఉమ్మడి ఐదు జిల్లాల కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ ఈ మేరకు కిష్టయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. కిష్టయ్య గతంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకుడిగా సేవలందిస్తూ సంఘ బలోపేతానికి కృషి చేసిన విషయం తెలిసిందే. ఆయన అందించిన సేవలను గుర్తించిన సంఘ పెద్దలు, విలీన గ్రామాల స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగిస్తూ కన్వీనర్‌గా నియమించారు. నియామకం సందర్భంగా ఎలిగేటి కిష్టయ్య మాట్లాడుతూ… పద్మశాలి సంఘం అభివృద్ధికి, ఐక్యతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. కిష్టయ్య కన్వీనర్‌గా నియమితులవడంతో ధర్మారం సహా పరిసర గ్రామాల పద్మశాలిలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.


