- సీఈవో సుదర్శన్‌రెడ్డి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొత్త సంస్కరణలతో తొలిసారిగా బీహార్‌తోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, సుదర్శన్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ (ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమా వేశంలో పాల్గొన్నారు. ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు.
సహకరించండి..
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో ఏర్పాట్లను సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్షించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో అదనపు సీఈవో లోకేష్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఉప సీఈవోలు హరిసింగ్, సత్యవాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


