ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సీఐ రమేష్,పట్టణ ఎస్సై శ్రీధర్ ఉన్నారు.


