ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాలి
: జనగామ అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
దేవరుప్పుల పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన
కాకతీయ, జనగాం : జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా ఎన్నికల నియమావళి ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ జారీ, స్వీకరణ ప్రక్రియ, ధృవీకరణ విధానం, బ్యాలెట్ బాక్సుల భద్రత, రికార్డు నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ, సిబ్బంది సమన్వయం వంటి కీలక అంశాలను అదనపు కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ప్రతి దశలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగమని పేర్కొన్నారు. ప్రతి అంశంలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అంతరాయం లేకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంఎస్‌వో, దేవరుప్పుల ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓతో పాటు వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.


