- ఎంపీడీవో వేణుమాధవ్
కాకతీయ, పెద్దవంగర : పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఎంపీడీవో వేణుమాధవ్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఒక జడ్పీటీసీ, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ,26 సర్పంచ్ సభ్యుల స్థానాలకు విడతల వారిగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాల కోసం తహసీల్దార్ నుంచి అనుమతి పొందాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధులకు అందుబాటులో ఉన్న ఎన్నికల గుర్తులను అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశాలు, రోడ్డు షోల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలోపు మాత్రమే వినియోగించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.


