కాకతీయ, దుగ్గొండి: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పెన్షన్లను పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల15న మండల కార్యాలయాల వద్ద నిర్వహించే మహాధర్నాలను జయప్రదం చేయాలని ఎంఎస్పీ జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరు ఆనందరావు మాదిగ పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల గౌరవ అధ్యక్షుడు కొలగాని రవి మాదిగ అధ్యక్షతన శనివారం జరిగిన పెన్షన్ దారుల సమావేశంలో ఆనందరావు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి రాష్ట్రంలోని పింఛన్ దారులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పెన్షన్లను పెంచి వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పియస్ నాయకులు పర్లపల్లి సదానందం మాదిగ, పెన్షన్ దారులు, తదితరులు పాల్గొన్నారు.


