epaper
Sunday, March 1, 2026
epaper

సాఫ్ట్‌వేర్ వాడి.. ఓట్ల తొల‌గింపు..!!

– కాంగ్రెస్‌కు ప‌ట్టున్న ప్రాంతాలే ల‌క్ష్యంగా కుట్ర‌
– ప్ర‌తిప‌క్షాల‌కు ఓట్లు వేసే క‌మ్యూనిటీలే టార్గెట్‌
– నకిలీ అప్లికేష‌న్లు, ఫోన్ నంబ‌ర్లు, లాగిన్ల‌తో ఓట‌ర్ ఐడీల తొల‌గింపు
– క‌ర్ణాట‌క ఆలంద్ నియోజ‌క‌వ‌ర్గంలో మోసం
– మా ద‌గ్గ‌ర వంద‌శాతం ఆధారాలు ఉన్నాయ్‌
– రాహుల్‌గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
– ఇందిర‌భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం
– రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఈసీ
– సాఫ్ట్‌వేర్‌తో ఓట‌ర్ ఐడీల‌ను తొల‌గించ‌లేర‌ని వెల్ల‌డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ మండిప‌డ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో ఓట్ల‌ను తొల‌గించారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు ఢిల్లీలో ఇందిరా భ‌వ‌న్‌లో గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను నకిలీ లాగిన్‌ల ద్వారా తొలగించేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. రాష్ట్రం వెలుప‌లి నుంచి నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓట‌ర్ ఐడీల‌ తొలగింపునకు అప్పీల్ చేశారని రాహుల్ తెలిపారు. ప్ర‌తిప‌క్షాల‌కు ఓట్లు వేసే క‌మ్యూనిటీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఓట్ల తొల‌గింపు జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఓట్ల తొల‌గింపు అంతా కూడా వ్య‌క్తుల‌తో కాకుండా, సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుక చేస్తున్నార‌ని అన్నారు. దీనికి సంబంధించి త‌మ వ‌ద్ద వంద‌శాతం ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబాయ్ పేరుతో ఫేక్ లాగిన్ ఉపయోగించి 12 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి ఓటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన టాప్ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్ తెలిపారు.

ఓట్ల చోరీకి పాల్ప‌డేవారిని ఎన్నిక‌ల సంఘం చీఫ్ ర‌క్షిస్తున్నార‌ని, ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాలంటూ చేస్తున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను విస్మ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది హైడ్రోజ‌న్ బాంబ్ కాద‌ని, దానిని త్వ‌ర‌లో పేలుస్తాన‌ని వెల్ల‌డించారు. కాగా, రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌నుకేంద్ర ఎన్నిక‌ల సంఘం ఖండించింది. సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి, ఓట‌ర్ ఐడీల‌ను డిలిట్ చేయ‌డం సాధ్యం కాద‌ని పేర్కొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img