కాకతీయ, నెల్లికుదురు: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలో చోటు చేసుకుంది. శనివారం ఎస్సై చిర్ర రమేష్ బాబు కథనం ప్రకారం స్థానిక మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ(80) తాను ఒక్కతే ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి వంటిమీద ఉన్న బంగారం కోసమో మరే ఇతర కారణాల గురించి చంపి ఇంటి పక్కన చేదబావిలో వేసినట్టుగా అనుమానం ఉందని మృతురాలి కొడుకు వీరగాని మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


