ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి.
కాకతీయ, పరకాల : పరకాల పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మూలమలుపు వద్ద బస్సు క్రిందపడి ములుగు జిల్లా పాల్సాబ్ పల్లె గ్రామానికి చెందిన తోట రాధమ్మ (75 ) మృతి చెందడం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం వివరాలలోకి వెళితే బుధవారం వరంగల్ 2డిపో కి చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు టిఎస్ 03 UC 65 67 గల నెంబర్ గల బస్సు భూపాలపల్లి నుండి హన్మకొండ కి వెళ్తున్న క్రమంలో పరకాల బస్టాండ్ కి వస్తుండగా మూల మలుపు వద్ద నడుచుకుంటూ వస్తున్న వృద్దురాలు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని స్థానికులు తెలిపారు.
కేసు నిమిత్తం పరకాల పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.


