రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన గాడిపల్లి పెంటయ్య (70) తన సొంత పనులు ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూర్ వైపు వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకోగా, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


