కాకతీయ, పెద్దవంగర : పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో శనివారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన కూన నారాయణ (65) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు ఎక్కువైనందున శుక్రవారం తెల్లవారుజామున అతడి వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య కూన శశిరేఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


