బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : నగరంలోని చైతణ్యపురిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా సంజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు కల్పించినందుకు సంజయ్‌కు సునీల్‌రావు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంజయ్ కూడా సునీల్‌రావును శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ శ్రేణులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు.


