- ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ: గ్రామాల్లో లో వోల్టేజీ సమస్యలు రాకుండా వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని విశ్వనాధపురం, మొగిలిచర్ల గ్రామాలలో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో లో వోల్టేజ్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కన్స్ ట్రక్షన్ డీఈ అర్జి నాయక్, ఏీఈ రాజు, విద్యుత్ శాఖ ఏడీఈ రవికుమార్, తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, గొర్రెకుంట ఏఈ రవి కిరణ్, మచ్చాపురం ఏఈ సంపత్ కుమార్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


