శిశుమందిర్‌లో విద్య, విలువల అవగాహన కార్యక్రమం
కాకతీయ, కరీంనగర్ : శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆచార్యుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న నేత్రవైద్య నిపుణులు డా. చిట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో సంస్కారం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థుల చదువులో తల్లిదండ్రుల సహకారం విజయానికి పునాది అవుతుందని చెప్పారు.అతిథిగా హాజరై మాట్లాడిన ఎలగందుల సత్యనారాయణ శిశుమందిరాలు విద్యతో పాటు విలువల పెంపుకి ప్రాధాన్యం ఇస్తున్నాయని, విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రామ్మోహన్, కొత్తూరి ముకుందం, గీకురు శ్రీనివాస్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం మార్గదర్శకంగా నిలిచిందని ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, తణుకు మహేష్, డా. చక్రవర్తుల రమణాచారి, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డా. నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆచార్యులు పాల్గొన్నారు.


