కాకతీయ, బిజినెస్ డెస్క్: పండగల సీజన్ షురూ అయ్యింది. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి పండగలు రానున్నాయి. ఈ క్రమంలోనే సామాన్యులకు బిగ్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పండగ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో పిండవంటలు చేసుకునే వారు చాలా ఉంటారు. ఇంటికి గెస్టులు, బంధువులు వస్తుంటారు. వారికి కొత్త కొత్త వంటకాల రుచి చూపిస్తుంటారు.
పిండివంటలు చేయాలంటే కచ్చితంగా వంట నూనెల ఉండాల్సిందే. వంటనూనెలకు సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. దేశంలో వంట నూనెల మార్కెట్ ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 60శాతం నూనెల దిగుమతులపై దేశం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ మార్కెట్ ధరల మార్పులు, రూపాయి బలహీనత వంటి అంశాలు దిగుమతులను ఖరీదైనవిగా మార్చాయి. దీంతో ఈ పండగల వేళ వినియోగదారులు అధిక ధరలకు నూనెను కొనాల్సిన పరిస్థితి నెలకుంటుంది.
AWLఅగ్రి మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మల్లిక్ స్పందిస్తూ..ప్రస్తుతం తాము వినియోగిస్తున్న నూనెలో 60శాతం లేదా అంతకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. దేశీయ ఉత్పత్తి కేవలం 2శాతం వ్రుద్ది చెందుతుంటే వినియోగం సుమారు 3శాతం చొప్పున పెరుగుతోంది. వంట నూనెల ధరలను ప్రధానంగా ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల ప్రభావితం చేస్తాయి.
దీంతో నూనెల దిగుమతి ఖర్చు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం సరఫరా పరిస్ధిులు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వంట నూనెల నిల్వలు సరిపడే విధంగా ఉన్నాయి. స్థానిక పంటలు కూడా బాగున్నాయి. రవాణా, లాజిస్టిక్స్ పై వర్షాకాలం ప్రభావం చూపితే తప్ప సరఫరాలో ఎలాంటి పెద్దగా అంతరాయం ఉండదని తెలిపారు.


