కాకతీయ,నర్సింహులపేట: కూరగాయల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఆదివారం జయపురం గ్రామంలో సాగులో ఉన్న బీర, పచ్చిమిర్చి, మునగ పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
మల్చింగ్, పందిరి, ఆయిల్ ఫామ్ సాగుకు రాయితీలు, పలు ప్రోత్సాహాలను ప్రభుత్వం అందజేస్తుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం జయపురం గ్రామంలో కూరగాయల పంటను సాగు చేస్తున్న యువరైతు మందుల యాకుబ్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో రైతు మందుల యాకూబ్,బిందుసేద్యం ప్రతినిధి బోళ్ళఅశోక్ తదితరులు పాల్గొన్నారు.


