కాకతీయ, గీసుగొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా పోలీస్ గార్డు గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు.
సిబ్బంది కిట్టు, ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి వారి విధి నిర్వహణపై ప్రశ్నించారు. తర్వాత స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి పరిసరాలను పరిశీలించారు. అదే విధంగా మహిళా సహాయక కేంద్రం, సన్నిహిత కేంద్రం కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు.
స్టేషన్ లోపల లాక్‌అప్ గదిని పరిశీలించి,రికార్డుల భద్రపరిచిన విధానాన్ని కూడా పరిశీలించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో మాములూరు ఏసీపీ వెంకటేశ్వర్లు,సీఐ ఎ.మహేందర్, ఎస్ఐలు కుమార్,అనిల్, రోహిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


