అల్ఫోర్స్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ అధినేత డా. వి. నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, ఐక్యత, మానవత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


