కోట గండి మైసమ్మ వద్ద మొదలైన దసరా హంగామా
*గాంధీ జయంతి రోజు దసరా రావడంతో 1వ తారీకు రాత్రి నుండే మొదలైన మొక్కులు
*కోట గండి వద్ద గొర్రెలు మేకలతో బారులు తీరిన భక్తులు
కాకతీయ,గీసుగొండ:
కోటగండి మైసమ్మ వద్ద దసరా పండుగ హంగామా మొదలైంది. గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో 1వ తారీఖు రాత్రి నుండే మండలంలోని కోటగండి మైసమ్మ వద్ద ప్రజలు దసరా ఉత్సవాలు మొదలుపెట్టారు. గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో ముందు రోజు రాత్రి నుండి వాహనదారులు భక్తులు కోటగండి మైసమ్మ వద్ద యాటపోతులతో తమ మొక్కలు తీర్చుకోవడానికి వాహనదారులు భక్తులు బారులు తీరారు. దీంతో కోట గండి మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణం భక్తుల తాకిడితో కోలాహలంగా మారింది. తెల్లవారే లోపు మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని తమ వాహన పూజ పూర్తి చేసుకుని గొర్రెలు మేకల బలిచి తమ మొక్కులను తీర్చుకోవడానికి భక్తులు తమ వాహనాలతో ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు


