- ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బోగి సురేష్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలా వరంగల్ తూర్పు కోటలో వచ్చేనెల రెండున నిర్వహించనున్న దసరా వేడుకలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బోగి సురేష్ అన్నారు. ఈ సందర్బంగా సోమవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి మాట్లాడారు. తూర్పు కోట దర్వాజా వద్ద అంగరంగ వైభవంగా రావణ వధ కార్యక్రమం నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రాంత అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, వారి ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమం చేస్తామన్నారు.
అదే రోజున నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాంధించిన సుమారు ఇరవై మందిని ఆహ్వానించి సన్మానం చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఉత్సవ కమిటీ సభ్యులు కందిమల్ల మహేష్, బోయిని దూడయ్య, వనపర్తి ధర్మరాజు, గన్నారపు రమేష్, సుంచు జగదీశ్, బోలుగొడ్డు శ్రీనివాస్, సంగరబోయిన చందర్, మేకల కుమార్, పోషల శ్రీనివాస్, ఆరసం రాంబాబు, చింతం రమేష్, బిళ్ళ కిషోర్, పెసరు కుమార్, సుంచు వీరన్న, సిరబోయిన వాసుదేవ్, ఏసిరెడ్డి రమేష్, బేర నరేందర్, వనపర్తి కర్ణాకర్, శేఖర్, ప్రమోద్, ప్రతాప్, కమలాకర్, రాజమల్లు,అమృత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


