రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్
కాకతీయ, జగిత్యాల : మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రమాదాలకు దారితీసే తీవ్రమైన చర్య అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.గడిచిన 10 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 8,686 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై ఐపీసీ 304-II కింద కేసులు బుక్ చేస్తున్నామని ఆయన వివరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసులు పంపుతున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.పట్టుబడిన డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఎస్పీ తెలిపారు.


