కాకతీయ ధర్మసాగర్: నల్లగొండ జిల్లా దామెరచర్ల ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ తన లారీలో గురువారం సిమెంట్ బస్తాలను వేలేరు మండలం పీచర గ్రామంలో అన్లోడ్ చేసి వస్తున్న క్రమంలో వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామం వద్ద సదరు డ్రైవర్ గుండెపోటుతో లారీలోనే మరణించాడు.
ఈ సమాచారం అందుకున్న వేలేరు ఎస్.ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి వెళ్లి లారీలో ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని తన సిబ్బంది, స్థానికులతో కలిసి లారీ నుండి వ్యాన్ లోకి ఎక్కించి ఎంజీఎంకు తరలించారు.
ఈ ఘటనపై వేలేరు ఎస్సై సురేష్ వేగంగా స్పందించి, మృతదేహాన్ని లారీ నుండి వ్యాన్ లోకి ఆయన స్వయంగా ఎక్కించడంతో స్థానికులు ఎస్.ఐను అభినందించారు.


