పేదల కలల ఇళ్లు సాకారం
కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు
కాకతీయ, ఖమ్మం: పేదల సొంతింటి కలను నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన ఎస్.కే యాకూబ్ బీ (70) తన సొంత ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండే అవకాశం కలిగినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు త్వరగా విడుదల కావడంతో ఇల్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరో లబ్ధిదారులు ఎస్.కే షకీల్, రజియా మాట్లాడుతూ అద్దె ఇల్లు నుంచి సొంతింటికి మారడం జీవితంలో పెద్ద మార్పని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఈ ఇంటిని ప్రారంభించుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల నిర్మాణం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.


