కాకతీయ, రాయపర్తి : మండలంలోని 40 గ్రామాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా గురువారం విడుదల చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుగులోత్ కిషన్ తెలిపారు.ఈ జాబితాలోని పూర్తి వివరాలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శన చేశామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు జాబితాలో మీ పేరు వివరాలు చెక్ చేసుకోవాలన్నారు.ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సరిచేసి సెప్టెంబర్ 2వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


