కాకతీయ, వరంగల్: స్వేరో స్టూడెంట్స్ యూనియన్(SSU) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ సాయంత్రం ఏడు గంటలకు డిబేట్ లో పాల్గొనమని చెప్పి ఏబీఎన్ న్యూస్ ఛానల్ లో స్క్రోలింగ్ దళిత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కేవలం దళితుల కోసమే పనిచేయడం లేదని ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ అధిపతి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ వేమురి రాధాకృష్ణన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఎంతో మంది పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణాల్లో పేదల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిని దళిత నాయకుడు అనే ముద్ర వేయడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నాను.
అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగ వృత్తిలో ఉన్నప్పుడు ఎంతోమంది పేదలకు కులాలకు,మతాలకు అతీతంగా సభ్యుండ వర్గాలకు మేలు చేసిన వ్యక్తి ని పట్టుకొని ఈ రోజు ఆంధ్రజ్యోతి మెయిన్ స్ట్రీమ్ మీడియా దళిత నాయకుడు అని అవమానిస్తున్న వేముల రాధాకృష్ణ తన మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణలు కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ ఉద్యమంలో తను పోలీస్ ఉద్యోగంలో వండుకుంటూ తెలంగాణ వాదం వైపు నిలిచిన వ్యక్తి ఎంతోమంది తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల శవాలను తన భుజాల మీద మోసిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా ఎవరెస్టు శిఖరం ఎక్కించిన మలవతు పూర్ణ ,ఆనందుల విజయాన్ని కూడా తనకే దక్కుతుంది ,అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులను అజీమ్ ప్రేమ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఏఎస్ ఐపీఎస్ , పైలెట్ మరియు ఇతరాంతర ఉద్యోగాలు పొందే విధంగా తయారుచేసిన వ్యక్తి ఆర్ ఎస్ పి ఇతర దేశాలకు పై చదువుల కొరకు పంపించిన ఘనత కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక్కసారి తన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసేముందు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క స్టేటస్ ఏంది తన ఉద్యోగ వృత్తిలో ఏ విధంగా పని చేసిండు రాజకీయ రంగంలోకి వచ్చాక ఎలా పనిచేస్తున్నాడో కూడా గమనించాల్సిన అవసరం ఉంది తాను స్వేరోస్ నెట్వర్క్ ను స్థాపించి ఇతర దేశాలలో కూడా ఆ నెట్వర్క్ ను విస్తరించి పేద ప్రజల పక్షాన అండగా నిలుస్తున్న స్వేరోస్ నెట్వర్క్ ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి దక్కుతుంది తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు చెట్టుపల్లి శివకుమార్, బన్నీ, వంశీ, శ్రావణ్, కృష్ణ ,రాజేష్, సురేష్, కిరణ్, మహేష్, రాకేష్, సుఖేష్, సిద్దు ,ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.


